Ritu Varma | సందీప్ కిషన్‌కు జోడిగా రీతు వర్మ.?
Sundeep kishan | టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఏస్‌కే30. ఈ సినిమాకు ధమకాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం రీసెంట్గా షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కథానాయికకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వచ్చింది.
Sundeep kishan | టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఏస్‌కే30. ఈ సినిమాకు ధమకాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం రీసెంట్గా షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కథానాయికకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వచ్చింది. ఈ చిత్రంలో సందీప్‌కు జోడిగా పెళ్లి చూపులు భామ రీతు వర్మ (Ritu Varma) నటించబోతున్నట్లు తెలుస్తుంది. ముందుగా ఈ చిత్రం కోసం కొత్త అమ్మాయిని అనుకున్న చివరికి రీతు వర్మకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై వస్తున్న సినిమా ఇది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర సమర్పిస్తున్నారు. ధమాకా తర్వాత రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ.. ఈ సినిమాకు కూడా కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ అందిస్తున్నాడు. సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

