Dhamaka Movie | బుల్లితెరపై దుమ్ము దులిపిన ధమాకా.. రికార్డు టీఆర్పీ నమోదు
Dhamaka Movie Television Premier | 'క్రాక్' తర్వాత రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఉన్న గందరగోళ పరిస్థితులో ఉన్న రవన్నకు 'ధమాకా' తిరుగులేని విజయాన్నిచ్చింది. నిజానికి ఈ సినిమాకు రివ్యూలు కూడా పెద్దగా ఆశాజనకంగా రాలేవు.
Dhamaka Movie Television Premier | ‘క్రాక్’ తర్వాత రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఉన్న గందరగోళ పరిస్థితులో ఉన్న రవన్నకు ‘ధమాకా’ తిరుగులేని విజయాన్నిచ్చింది. నిజానికి ఈ సినిమాకు రివ్యూలు కూడా పెద్దగా ఆశాజనకంగా రాలేవు. రొటీన్ డ్రామా అని, ఇలాంటి కథలను ఇప్పటికే చాలా చార్లు చూసేసామని బోలెడు నెగెటీవ్ రివ్యూలు. కట్ చేస్తే రవితేజ కెరీర్లో తొలి వంద కోట్ల బొమ్మ అయింది. రవన్న ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, శ్రీలీల నటన, డ్యాన్సులు సినిమా రేంజ్‌నే మార్చేశాయి. ఇక భీమ్స్ పాటలైతే థియేటర్లను ఊపేశాయి. ఆల్బమ్ మొత్తం చార్ట్ బస్టరే. నిజానికి ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ భీమ్స్‌కే దక్కుతుంది. వీటికి తోడు పోటీగా ఏ సినిమా లేకపోవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈలేసుకుంటూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
ఇక మూడు నెలల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై అక్కడ కూడా సంచలనం సృష్టించింది. వరుసగా రెండు వారాలు టాప్ 10 ట్రెండింగ్స్‌లో నిలిచి ఓటీటీలోనూ అదరహో అనిపించింది. ఇక తాజాగా ఈ సినిమా బుల్లితెరపై కూడా అనూహ్య రీతిలో టీఆర్పీని సాధించి ఇక్కడ కూడా విజయ కేతనం ఎగరేసింది. గతనెల చివరి వారంలో జెమినీలో వరల్డ్ టెలివిజన్ ప్రిమియర్‌కు ఏకంగా 10.08 టీఆర్పీ రేటింగ్ సాధించి అదరగొట్టింది. ఈ మధ్య బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన సినిమాలు సైతం ఈ రేంజ్ టీఆర్పీని సాధించలేకపోతున్నాయి. అలాంటిది రవితేజ ఈ సినిమాతో సాధించడంటే మాములు విషయం కాదు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

