Irumudi | ‘ఇరుముడి’ రికార్డుల వేట.. 4 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్.. టికెట్ సేల్స్‌లో సరికొత్త సంచలనం!
Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది.
Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. రవితేజ కెరీర్లో అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది. చాలా కాలంగా ఒక భారీ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం కెరీర్లోనే ప్రత్యేకమైన విజయాన్ని అందించిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
సాధారణంగా వీకెండ్ ముగిసిన తర్వాత వచ్చే మొదటి సోమవారం చాలా సినిమాల బుకింగ్స్, ఆక్యుపెన్సీలు తగ్గడం సహజం. కానీ ‘ఇరుముడి’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. విడుదలైన నాలుగో రోజు కూడా సినిమా బుకింగ్స్ బలంగా కొనసాగడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మొదటి రోజు స్థాయికి దగ్గరగా బుకింగ్స్ నమోదవడం ‘ఇరుముడి’పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. రీజినల్ సినిమాల్లో ఫస్ట్ మండే బుకింగ్స్ పరంగా కూడా ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు కేంద్రాల్లో ఆక్యుపెన్సీలు అత్యంత బలంగా నమోదవుతున్నాయి. ‘ఇరుముడి’ హవా టికెట్ సేల్స్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కేవలం నాలుగు రోజుల్లోనే 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. భారీ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు తరలిరావడంతో అనేక ప్రాంతాల్లో షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి.
వీకెండ్ తర్వాత కూడా అదే జోరు కొనసాగుతుండటంతో సినిమా లాంగ్ రన్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఐదో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉండటంతో ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ప్రయాణం మరింత దూకుడుగా సాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు మంచి స్పందన రావడం చిత్రానికి పెద్ద ప్లస్‌గా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్, రవితేజ ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని అభిమానులు చెబుతున్నారు.మొత్తానికి నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ మైలురాయిని చేరుకున్న ‘ఇరుముడి’ ఇప్పుడే తన రికార్డుల వేటను ప్రారంభించినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

