Bhagavanth Kesari Movie | బాలయ్య ఊరమాస్.. ఆంధ్ర ఏరియాలో ఆల్‌టైమ్ రికార్డు బిజినెస్..!
Balakrishna | నరికినా కొద్ది నీకు ఆయసం వస్తుందేమో.. నాకు ఊపొస్తుంది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అయనకే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఏజ్ అయిన కొద్ది మరింత ఊపుతో బాలయ్య సినిమాలు చేస్తున్నాడు. పైగా తన ఏజ్ తగ్గ పాత్రలు ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో చెలరేగిపోతున్నాడు.
Balakrishna | నరికినా కొద్ది నీకు ఆయసం వస్తుందేమో.. నాకు ఊపొస్తుంది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అయనకే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఏజ్ అయిన కొద్ది మరింత ఊపుతో బాలయ్య సినిమాలు చేస్తున్నాడు. పైగా తన ఏజ్ తగ్గ పాత్రలు ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో చెలరేగిపోతున్నాడు. ఒకప్పుడు యాభై కోట్ల మార్క్ టచ్ చేయడానికి నానా కష్టాలు పడే బాలయ్య ఇప్పుడు తొలిరోజే యాభై కోట్ల రేంజ్లో వసూళ్లు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి అనే యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా బిజిఎస్ ఓ రేంజ్లో జరుగుతుందని ఇన్సైడ్ టాక్.
ఒక్క ఆంధ్ర ఏరియాలోనే ఈ సినిమాకు రూ.35 కోట్ల బిజినెస్ జరిగిందట. అదికూడా సీడెడ్ మినహాయించి. ఇది బాలయ్య కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డు. ఇక నైజాంలోనూ దిల్‌రాజు పెద్ద మొత్తంలో ఈ సినిమాను కొనబోతున్నట్లు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సుమారుగా రూ.60 కోట్ల రేంజ్లో బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుంటే మరో రూ. 20 కోట్లు ఈజీగా బిజినెస్ జరుగుతుందట. మొత్తంగా చూసుకుంటే బాలయ్య కెరీర్లోనే అత్యధికంగా రూ.80 కోట్ల రేంజ్లో బిజినెస్ జరుపుకుంటుందట. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అవ్వాలంటే రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది.
పోటీగా లియో, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలున్నా ఈ రేంజ్లో బాలయ్య సినిమాకు బిజినెస్ జరుగుతుందంటే మాములు విషయం కాదు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. శ్రీలీల కీలక పాత్ర చేస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

