సవాళ్లకు సిద్ధంగా ఉన్నా!

‘సాధారణంగా తొలి సినిమాకు ఎవరైనా ప్రేమకథనే ఎంచుకుంటారు. అలా కాకుండా నటనాపరంగా ఛాలెంజ్‌గా ఉండాలని హారర్ ఇతివృత్తంలో నటించాను’ అని చెప్పింది నట్టి కరుణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం‘డీఎస్‌జే’ (దెయ్యంతో సహజీవనం). నట్టి కుమార్ దర్శకుడు. ఈ నెల 28న ఐదు భాషల్లో విడుదలకానుంది. నట్టి కరుణ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తా. హారర్‌తో పాటు ప్రేమ, యాక్షన్ హంగులన్నీ ఉంటాయి. హైదరాబాద్‌లో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం. పోరాటఘట్టాలు సవాలుగా అనిపించాయి. ఐదంతస్తుల మేడ మీది నుంచి దూకడం, కారు మీద రోప్ లేకుండా సాహసాలు చేయడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. సినిమాలో అమ్మవారికి, దెయ్యానికి మధ్యన వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. నాన్నే దర్శకుడు కాబట్టి కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించగలిగా. నటిగా భవిష్యత్తులో సవాళ్లకు సిద్ధంగా ఉన్నా. విజయశాంతి తరహా శక్తివంతమైన పాత్రల ద్వారా పేరు తెచ్చుకోవాలనుంది’అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

