ఫొటో సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది రాజోలు సుందరి అంజలి (Anjali). ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అంజలి తనకిష్టమైన ప్లేస్‌లో దిగిన స్టిల్ ఒకటి నెట్టింట్లో పోస్ట్ చేసింది.
షార్ట్ డ్రెస్‌లో ఉన్న అంజలి patchi chocolate క్యాబిన్ డోర్ ముందు నిలబడి పైకి చూస్తున్న క్యూట్ స్టిల్‌ను ట్విటర్ షేర్ చేస్తూ #FridayVibes హ్యాష్ ట్యాగ్ జోడించింది. అంజలి తనకిష్టమైన ప్లేస్‌లో ఛిల్ అవుట్ అవుతుందని అర్థమవుతున్నా.. ఇంతకీ ఎక్కడికెళ్లిందనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టింది. అంజలి పోస్ట్‌కు గుడ్ మార్నింగ్ అంజలి అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. నువ్వు చాలా అందమైన అమ్మాయివి అంటూ మరో ఫాలోవర్ కామెంట్ పోస్ట్ చేశాడు. అంజలి తాజా స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, మసాలా, డిక్టేటర్, చిత్రాంగదతోపాటు పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2021లో వకీల్‌సాబ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ ప్రస్తుతం ఆర్సీ 15లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఛిల్ అవుట్ మూడ్‌లో అంజలి..
🍬 #FridayVibes pic.twitter.com/Ge4wrGP8rx
— Anjali (@yoursanjali) January 13, 2023