‘వృత్తిరీత్యా 2000 సంవత్సరం వరకూ చెన్నైలో ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్‌కి మారాను. అనుకోకుండా ట్రైన్లో సుద్దాల అశోక్‌తేజ కలిశారు. ఆ జర్నీలో ఆయన రజాకారుల దుర్మార్గాల గురించి, వాళ్ల నాన్న హనుమంతు రజాకార్లపై చేసిన పోరాటం గురించీ, ఆయన రాసిన తెలంగాణ సాహిత్యం గురించి విన్నప్పుడు రోమాంచితుడయ్యాను. తెలంగాణకు వచ్చిన కొత్తలో ఇక్కడి మారుమూల ప్రాంతాలకు వెళ్లేవాడ్ని.
ప్రజల అనుభవాలు వినేవాడ్ని. నిజామాబాద్ ఖిల్లాకి వెళ్లినప్పుడు దాశరధి రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ పాట గుర్తొచ్చింది. ఆ ప్రేరణతో తీసిన సినిమానే ‘రాజన్న’. అందులో రజాకార్ల దాష్టీకం గురించి లైట్‌గా టచ్ చేశాను. పూర్తిగా ఎవరైనా తీస్తే బావుండని అనుకున్నా.
గూడూరు నారాయణరెడ్డిగారి ద్వారా నా కోరిక తీరింది’ అన్నారు రచయిత విజయేంద్రప్రసాద్. తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రజాకార్’. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకుడు. గూడూరు నారాయణరెడ్డి నిర్మాత. ఇటీవల విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.