Venu Udugula | ‘రజాకార్’ సినిమా బీజేపీ రాజకీయ ఎజెండాలో భాగం: దర్శకుడు వేణు ఉడుగుల
RazakarMovie | ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల (Venu Udugula) 'రజాకార్' (Razakar) చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే ఈ సినిమా, భారతీయ జనతా పార్టీ (BJP) యొక్క రాజకీయ ఎజెండాలో (Political Agenda) భాగమని ఆయన ఆరోపించారు.
Venu Udugula | ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల (Venu Udugula) ‘రజాకార్’ (Razakar) చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే ఈ సినిమా, భారతీయ జనతా పార్టీ (BJP) యొక్క రాజకీయ ఎజెండాలో (Political Agenda) భాగమని ఆయన ఆరోపించారు.
‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ అంటూ వచ్చిన ఈ చిత్రానికి యాటా సత్య నారాయణ దర్శకత్వం వహించగా.. బీజేపీ నేత గూడురు నారాయణ రెడ్డి నిర్మించాడు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకోవడమే కాకుండా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం బీజేపీ ప్రాపగండా మూవీ అని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు. అయితే ఈ సినిమాపై తాజాగా దర్శకుడు వేణు ఉడుగుల స్పందిస్తూ రజాకార్ చిత్రం చారిత్రక చిత్రం కాదని.. ఇది బీజేపీ రాజకీయ ఎజెండా సినిమా అని తెలిపాడు.
”రజాకార్ సినిమాను కేవలం చరిత్ర చెప్పడానికి మాత్రమే తీయలేదు. దీని వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశం ఉంది. ఇది బీజేపీ యొక్క రాజకీయ ఎజెండాకు మద్దతు ఇచ్చే విధంగా రూపొందించబడింది. చరిత్రను చెప్పాలంటే మానవీయకోణంలో చెప్పాలి. కానీ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారిని నెగిటివ్‌గా చూపించారు. రాజాకార్లంటే కేవలం ముస్లింలే లేరు. ఈ సినిమా తీసినప్పుడు చరిత్ర గురించి తెలుసుకుని తీయాల్సింది. సాయుధ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు వదిలారు. ఈ ఘటనల గురించి చెప్పడానికి చాలామంది చరిత్రకారులు ఇప్పటికి బ్రతికిఉన్నారు. కానీ ఎవరిని సంప్రదించకుండా ఒక ఎజెండాతో ఈ సినిమాను తెరకెక్కించారంటూ” వేణు చెప్పుకోచ్చాడు.
‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించిన వేణు ఉడుగుల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

