Ramarao On Duty Movie | పోస్ట్ ప్రొడక్షన్ మేకింగ్లో బిజీగా ఉన్న ‘రామారావు’ యూనిట్.. వీడియో వైరల్
Ramarao On Duty Pre Production video | కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్గా రవితేజ వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా మాస్రాజ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈయన సినిమాల నుంచి వస్తున్న అప్డేట్స్ ఏ హీరో సినిమాల నుంచి కూడా రావడంలేదు. ప్రతి వారం ఏదో ఒక అప్డేట్తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 28న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. రామారావు యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరల్ అవుతుంది. రవితేజ ఈ చిత్రంలో డిప్యూటీ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

