Dhamaka Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న రీసెంట్ బ్లాక్‌బస్టర్ ధమాకా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'క్రాక్'తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజకు రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు మార్కెట్‌పై పట్టుకోల్పోయేలా చేశాయి. ఈ క్రమంలో మాస్ మహరాజా బోలెడన్ని ఆశలతో 'ధమాకా'తో గతేడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Dhamaka Movie On OTT | ‘క్రాక్’తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజకు రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు మార్కెట్‌పై పట్టుకోల్పోయేలా చేశాయి. ఈ క్రమంలో మాస్ మహరాజా బోలెడన్ని ఆశలతో ‘ధమాకా’తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ వీక్‌లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండు వారాల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశాయి. రవితేజ కెరీర్లో తొలి వంద కోట్ల గ్రాస్ సినిమా ఇదే అవడం గమనార్హం.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ధమాకా ఓటీటీ రిలీజ్ డేట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ సినిమా జనవరి 22 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహించాడు. రవితేజకు జోడీగా శ్రీలీల నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్స్ట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ-మాటలు అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

