Dhamaka Movie | మాస్ మహరాజా మాస్ కంబ్యాక్ ఇచ్చేశాడు. ‘క్రాక్’ తర్వాత వరుస డిజాస్టర్లతో పట్టుకోల్పోయిన మార్కెట్‌ను మళ్లీ పుంజుకునేలా చేశాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లు సాధిస్తుంది. రవితేజ కెరీర్లో అత్యంత వేగంగా బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా ధమాకా రికార్డు క్రియేట్ చేసింది. ఇక క్రాక్ తర్వా త మళ్లీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్తో అభిమానులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేశాడు. తాజాగా రవితేజ వంద కోట్ల క్లబ్లో చేరాడు.
‘ధమాకా’ రిలీజై రెండు వారాలు దాటింది. ఇప్పటికి కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. రోజు రోజుకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతందే తప్ప తగ్గడం లేదు. ఓపెనింగ్ డే నుండి ధమాకా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. నెగెటీవ్ టాక్‌తో స్టార్ అయిన ఈ సినిమా వంద కోట్లు సాధించిందంటే విశేషం అనేచెప్పాలి. సంక్రాంతి వరకు ఈ సినిమాకు ఎలాంటి అడ్డు లేదు. ఈజీగా మరో 10కోట్ల గ్రాస్ సాధించే చాన్స్ ఉంది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రవితేజకు జోడీగా ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల నటించింది. రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హిట్టు రావడంతో అటు రవితేజ, ఇటు ఆయన ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందించాడు.
MassMaharaja @RaviTeja_offl 's
Bombarding 1️⃣0️⃣0️⃣ CR+..
Reverberating Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/Nb82bElsW1
— People Media Factory (@peoplemediafcy) January 6, 2023