1970ల్లో ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ‘టైగర్ నాగేశ్వరరావు’ అంటే జనానికి టెర్రర్. కొమ్ములు తిరిగిన నాయకుల్ని సైతం చమటలు పట్టించిన బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు. అతని బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబర్ 20న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమా ట్రైలర్‌ని అక్టోబర్ 3న మేకర్స్ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశారు. పోస్టర్లో డాషింగ్ లుక్‌తో కనిపిస్తున్నారు రవితేజ. ఈ సినిమాకు జీవి ప్రకాశ్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వస్తున్నది. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, మాటలు: శ్రీకాంత్ విస్పా, సహనిర్మాత: మయాంక్ సింఘానియా.