రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌వర్మ దర్శకుడు. రవితేజ, అభిషేక్ నామా నిర్మాతలు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘ప్యార్‌లోన పాగల్…’ అనే గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్నందించారు. ఈ సందర్భంగా రవితేజ కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ‘ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తారు. ైస్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. దర్శకుడు సుధీర్‌వర్మ తనదైన శైలి టేకింగ్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఆద్యంతం అనూహ్య మలుపులతో థ్రిల్‌ను పంచుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, దర్శకత్వం: సుధీర్‌వర్మ.