వేసవిలో ‘మాస్ జాతర’
రవితేజ 75వ చిత్రానికి ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
రవితేజ 75వ చిత్రానికి ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో జాతర సందడి నడుమ తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్నారు రవితేజ. టైటిల్‌కు తగినట్లుగానే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నామని, వినోదానికి పెద్దపీట వేశామని దర్శకుడు తెలిపారు. అభిమానులకు విందుభోజనంగా ఈ సినిమా ఉంటుందని, రవితేజ అభిమానులు కోరుకునే అన్ని అంశాలుంటాయని చిత్రబృందం తెలిపింది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

