75వ సినిమా మొదలైంది
రవితేజ 75వ సినిమా షూటింగ్ మంగళవారం పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. శ్రీలీల ఇందులో కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ప్రొడక్షన్ నంబర్ 28’గా మొదలైన ఈ చిత్రం ద్వారా యువరచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
రవితేజ 75వ సినిమా షూటింగ్ మంగళవారం పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. శ్రీలీల ఇందులో కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ప్రొడక్షన్ నంబర్ 28’గా మొదలైన ఈ చిత్రం ద్వారా యువరచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శ్రీలీల క్లాప్ కొట్టగా, భాను భోగవరపు దర్శకత్వం వహించారు.
ఇందులో రవితేజ హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించనున్నారని, వినోదంతో కూడిన పూర్తి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనున్నదని చిత్రం బృందం వెల్లడించింది. బ్లాక్బాస్టర్ ‘వాల్తేరు వీరయ్య’కు మాటలు రాసిన తాను, మరో బ్లాక్బాస్టర్ ‘సామజవరగమన’కు కథ, స్క్రీన్ప్లే రచయితగా పనిచేశానని, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్బీకే 109’కు మాటలు రాస్తున్నానని, ఇంత తక్కువ సమయంలో రవితేజ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అదృష్టంగా ఫీలవుతున్నానని దర్శకుడు భాను భోగవరపు అన్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, మాటలు: నందు సవిరిగాన, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కూర్పు: నవీన్ నూలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

