Ravi Teja | చివరగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. భారీ అంచనాల మధ్య విడుదల ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో రవితేజ రూటు మార్చి నయా జోనర్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. శివ నిర్వాణ డైరెక్షన్లో రవితేజ నటిస్తోన్న చిత్రం ఇరుముడి (Irumudi). షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా విడుదల కాకముందే రవితేజ మరో సినిమాను ట్రాక్‌పై తీసుకువచ్చాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
రవితేజను డైరెక్ట్ చేసే ఎవరా అనే కదా మీ డౌటు. రాజరాజచోర, స్వాగ్, బ్రోచేవారెవరురా సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హషిత్ గోలి. రవితేజ ఈ యువ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ క్రేజీ సినిమాను పాపులర్ నిర్మాత దిల్ రాజు తెరకెక్కించబోతున్నాడట.
త్వరలో ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రాబోతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మరి ఇదే నిజమైతే తనదైన కామిక్ టచ్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హషిత్ గోలి రవితేజను ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారనుంది. ఇరుముడి అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్లో తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో రాబోతుంది. మరి హషిత్ గోలీతో ఎలాంటి స్టోరీని చేయబోతున్నాడన్నది తెలియాల్సి ఉంది.