Raviteja | దళపతి విజయ్ పాటకు రవితేజ మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్..!
Raviteja | మాస్ మహారాజ రవితేజ మంచి హుషారు మీదున్నాడు. టైగర్ నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నాడు. మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మాములు ఎక్స్పెక్టేషన్స్ లేవు.
Raviteja | మాస్ మహారాజ రవితేజ మంచి హుషారు మీదున్నాడు. టైగర్ నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నాడు. మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మాములు ఎక్స్పెక్టేషన్స్ లేవు. టీజర్, ట్రైలర్లు చూసే ఆహా ఓహో అనుకుంటున్నారు. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని అప్పుడే ఊహల్లోకి వెళ్లిపోయారు. దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవల్లో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో తెగ బిజీగా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా రవితేజ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు.
కాగా తాజాగా హిందీ ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రవితేజ అక్కడ స్టేజీపై మాస్టర్ సినిమాలోని వాతి కమింగ్ పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Tiger for #Leo 😀💥@RaviTeja_offl vibes to #ThalapathyVijay & @anirudhofficial #VaathiComing 🔥💥✌🏻 https://t.co/ULZuDjB8fc
— KARTHIK DP (@dp_karthik) October 14, 2023
ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకు పోటీగా ముందు రోజు భగవంత్ కేసరి, లియోలు రిలీజ్ కానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

