‘రేసుగుర్రం’ విలన్ రవి కిషన్ ఇంట్లో విషాదం..!
Ravi Kishan | ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట్లో విషాదం అలుముకున్నది. రవికిషన్ అన్న రామ్ కిషన్ శుక్లా (53) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని రవికిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Ravi Kishan | ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట్లో విషాదం అలుముకున్నది. రవికిషన్ అన్న రామ్ కిషన్ శుక్లా (53) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని రవికిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరణించినట్లు పేర్కొన్నారు. సోదరుడి మరణం నేపథ్యంలో నటుడు ముంబయికి బయలుదేరాడు. ఆయన మృతికి పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు. రామ్ కిషన్ శుక్లా ముంబయిలో ఉంటూ రవికిషన్ ప్రొడక్షన్ పనులు చేసుకునేవారు.
సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది. దీంతో వెంటనే నానావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. రవికిషన్ తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. కిషన్ శుక్లా పెద్దవాడు కాగా, రవికిషన్ రెండోవాడు. కిషన్ శుక్లాకు కొడుకు ఉండగా.. భార్య ఇప్పటికే మృతి చెందింది. ఇదిలా ఉండగా.. రవికిషన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ చిత్రంలో.. ‘మద్దాలి శివారెడ్డి’ పాత్ర గుర్తింపు పొందారు. ఇటీవల గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం విధితమే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

