Raveena Tandon | వాళ్లకు గ్లామర్ మాత్రమే ముఖ్యం.. ట్రోల్స్‌పై స్పందించిన బాలీవుడ్ నటి
Raveena Tandon | తనపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది బాలీవుడ్ నాయిక రవీనా టాండన్. నటిగా తన ప్రతిభ చూడలేని వారు చేసే విమర్శలను పట్టించుకోనని ఆమె చెప్పింది.
Raveena Tandon | తనపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది బాలీవుడ్ నాయిక రవీనా టాండన్. నటిగా తన ప్రతిభ చూడలేని వారు చేసే విమర్శలను పట్టించుకోనని ఆమె చెప్పింది. రవీనా మాట్లాడుతూ…‘నేనొక మంచి చిత్రంలో నటించినప్పుడు నన్ను ఇష్టపడేవారు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రశంసిస్తుంటారు. ఇరవై మంది ఫాలోవర్స్ కూడా లేని కొందరు విమర్శించినంత మాత్రాన బాధపడను. వారు నా సినిమాలు చూసి ఉండరని అనుకుంటున్నా. చూస్తే అలా మాట్లాడరు.
సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారికి గ్లామర్ మాత్రమే ముఖ్యం. ప్రతిభావంతులైన నటీనటులు ఓ సినిమా కోసం ఎంత కష్టపడతారో వారికి తెలియదు. నాకు కమర్షియల్ చిత్రాల్లో నటించడం ఇష్టమే. వాటితో పాటు సమాజ హితాన్ని కోరే కథాంశాల్లో భాగమవడం సంతృప్తినిస్తుంటుంది. అలా ‘మాత్ర్ ‘, ‘దమన్’, ‘జాగో’ వంటి చిత్రాల్లో నటించాను. ఇవన్నీ మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, మహిళా సాధికారత నేపథ్యంలో రూపొందినవే’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె సంజయ్ దత్తో కలిసి ‘గుడ్ఛడీ’, ‘పాట్నా శుక్లా’ వంటి చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

