క్రిష్ సిద్ధిపల్లి హీరోగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. రాజు బోనగాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహుర్తపు వేడుకలో నిర్మాత అభిషేక్ అగర్వాల్, దర్శకుడు శశికిరణ్ తిక్కా, యుఎఫ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత రాజు మాట్లాడుతూ ‘ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఏప్రిల్ 3న చిత్రీకరణ ప్రారంభించి ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. రేవ్ పార్టీల్లో ఏం జరుగుతుంది? ఆ పార్టీల్లో యూత్ ఎలా ప్రవర్తిస్తుంటారు? ఈ రేవ్‌పార్టీలు జరగడానికి కారణం ఎవరు? ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలను ఇందులో చర్చిస్తున్నాం. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది’ అన్నారు.