Actress Hema | రేవ్ పార్టీ కేసు.. జైలు నుంచి విడుదలైన టాలీవుడ్ నటి హేమ
Actress Hema | డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటి హేమ నేడు విడుదలైంది. బెంగళురు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్నట్లు హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు షరతులతో కూడిన బెయిల్ లభించడంతో నేడు జైలు నుంచి బయటకు వచ్చారు.
Actress Hema | డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటి హేమ నేడు విడుదలైంది. బెంగళురు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్నట్లు హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు షరతులతో కూడిన బెయిల్ లభించడంతో నేడు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ (conditional bail) మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
గత నెల మే 19న కర్ణాటక రాజధాని బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున మత్తుపదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు టీవీ నటీనటులు (Telugu Stars), మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. హేమతో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఈ కేసులో జూన్ 3న హేమను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

