రవితేజ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై నైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘న్యాయవాదిగా రవితేజ పాత్రచిత్రణ నవ్యరీతిలో ఉంటుంది. ప్రజలకు న్యాయం చేసేందుకు అభినవ రావణాసురుడు ఎంచుకున్న మార్గమేమిటన్నది ఆసక్తిని కలిగిస్తుంది. రామ్‌గా సుశాంత్ పాత్ర కథలో కీలకంగా నిలుస్తుంది. అను ఇమ్మాన్యుయేల్, మేఘాఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు. సెప్టెంబర్ 30న సినిమాను విడుదలచేస్తాం. యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, హర్షవర్ధన్ రామేశ్వర్.