ఎర్రచీర.. పచ్చరైక
‘సామి..నా సామి..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో కథానాయిక రష్మిక మందన్న చేసిన నృత్యాలు, పలికించిన హావభావాలు మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ఆ పాటలో రష్మిక మందన్న వేసిన సిగ్నేచర్ స్టెప్‌తో సోషల్‌మీడియాలో లక్షలాది షార్ట్ వీడియోస్ రూపొందాయి.
‘సామి..నా సామి..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో కథానాయిక రష్మిక మందన్న చేసిన నృత్యాలు, పలికించిన హావభావాలు మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ఆ పాటలో రష్మిక మందన్న వేసిన సిగ్నేచర్ స్టెప్‌తో సోషల్‌మీడియాలో లక్షలాది షార్ట్ వీడియోస్ రూపొందాయి. అన్నింటికంటే ముఖ్యంగా రష్మిక ధరించిన బంగారు జరీ అంచు కలిగిన ఎర్రచీర, ఆకుపచ్చ జాకెట్ మగువల మనసు దోచుకుంది. ఇప్పుడు ఈ చీరకు రాజస్థాన్ జైపూర్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
శ్రీవల్లి ( ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న పాత్ర పేరు) శారీస్ పేరుతో పేరుపొందిన వస్త్ర దుకాణాలు ఈ చీరల్ని విరివిగా అమ్ముతున్నాయట. దాదాపుగా సినిమాలో రష్మిక ధరించిన చీరనే పోలి ఉండటంతో ఈ శ్రీవల్లి చీరలపై మహిళలు మనసు పారేసుకుంటున్నారని చెబుతున్నారు. మార్కెట్లో ఈ చీర తాలూకు ఫొటోల్ని నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. రాబోవు దేవీనవరాత్రి ఉత్సవాల్లో ధరించడానికి ఈ చీర బాగుంటుందని చాలా మంది మహిళలు అభిప్రాయపడుతున్నారట. ‘పుష్ప’ సినిమాతో రష్మిక మందన్న దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకోవడమే కాదు..కాస్ట్యూమ్స్ పరంగా కూడా ట్రెండ్ క్రియేట్ చేసిందని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

