మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్న
Rashmika mandanna | సినీరంగంలో నటీమణులు ఎక్కువ కాలం నిలదొక్కుకోలేరు అనే వార్త తరచూ వింటూనే ఉంటాం.
Rashmika mandanna | సినీరంగంలో హీరోయిన్లు ఎక్కువ కాలం నిలదొక్కుకోలేరు అనే వార్త తరచూ వింటూనే ఉంటాం. అందుకే హీరోయిన్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్ధుకోవాలి అనేలా అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకుంటారు. అది కూడా అందరి విషయాల్లో జరగదు. కానీ రష్మిక మాత్రం ఈ కోవలోకే వస్తుంది. తన అందం, అభినయం, నటనతో సౌత్ నుంచి నార్త్ వరకు విపరీతమైన ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. ఆ క్రేజ్‌తోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ స్టార్ హీరోల సినిమాలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఈమెకు ఉన్న క్రేజ్‌తో మీడియం బడ్జెట్ సినిమా కూడా ఒక మెట్టు ఎక్కుతుందనే దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే రష్మిక చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా రష్మికనే ఖరారు అయినట్లు సమాచారం.
దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. విజయ్‌కు జోడిగా పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినా.. చివరికి రష్మికనే ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. విజయ్ ప్రస్తుతం నెల్సన్ కుమార్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న బీస్ట్ సినిమా డబ్బింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం అనంతరం వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

