Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 400 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల ఖర్చును భరించేందుకు ముందుకొచ్చింది.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 400 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల ఖర్చును భరించేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది రష్మిక మందన్న. నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. ఈ ఛారిటీ కోసం ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి 400 కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ‘ఒక్కోవిడత 400 కుటుంబాలకు మూడు నెలల పాటు నిత్యావసర సరుకులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
వచ్చే ఏడాది మొత్తం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. దీనివల్ల ఆ కుటుంబాలు సరుకుల కోసం చేసే ఖర్చు ఆదా అవుతుంది. ఆ మొత్తాన్ని వారు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు’ అని రష్మిక మందన్న పేర్కొన్నది. సేవా కార్యక్రమాలంటే పెద్ద పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదని, దయాగుణంతో చేసే చిన్న సాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చుతుందని, మనందరం ఏదో ఒక చిన్న పనితో ఇతరులను ఆదుకోవాలని రష్మిక మందన్న పిలుపునిచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

