Vijay Thalapathy | తలపతి విజయ్ ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. ‘డాక్టర్’ ఫేం నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ పాట యూట్యూబ్‌లో 15కోట్ల రికార్డు వ్యూస్‌ను సాధించింది. ఈ చిత్రం అనంతరం విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమాను చేయనున్నాడు. తెలుగు, తమిళం భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో రూపొందనుంది.
ఈ చిత్రంలో విజయ్‌కు జోడిగా పలువురు హీరోయిన్లు అనుకున్న చివరికి రష్మిక అయితే బావుంటుందని మేకర్స్ రష్మికను ఫైనల్ చేశారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్‌ను కన్సార్మ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. విజయ్ తన 20 ఏళ్ల కెరీర్లో ఇప్పటి వరకు ఇలాంటి కథను వినలేదు అంటూ గతంలో ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ అప్పుడు తెగ వైరల్ అయింది. అప్పటినుంచి ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.