సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్చంద్ర నిర్మాతలు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నది. జూన్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో రావు బహదూర్గా రాయల్‌గా కనిపిస్తున్న సత్యదేవ్‌ని చూడొచ్చు.
సంప్రదాయ దుస్తుల్లో, అధికారదర్పంతో కనిపిస్తున్న సత్యదేవ్, తలపాగాపై కనిపిస్తున్న ఆ పురుగు.. ఇవన్నీ సింబాలిక్‌గా కథలోని ఏదో లోతైన అంశాన్ని చెబుతున్నట్టు గోచరిస్తున్నాయ్. ఇటీవల విడుదలైన తొలిపాట ‘ఓ సుందరి’ చార్ట్‌బస్టర్‌గా నిలిచిందని, సత్యదేవ్, దీప థామస్‌లపై చిత్రీకరించిన ఈ మెలొడీని వింటేజ్ ప్రేమ ను ప్రతిబింబించేలా వెంకటేశ్ మహా తెరకెక్కించాడని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పర్మార్, సంగీతం: స్మరణ్ సాయి.