Ranveer Singh : గూఢచర్యం, యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సిరీస్‌తో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన రణ్వీర్ సింగ్ (Ranveer Singh) తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ‘డాన్ 3’ చిత్రం నుంచి వైదొలగడంతో ఎఫ్‌డబ్ల్యూఐసీ నిషేధానికి గురైన రణ్వీర్ తాను ఉద్దేశపూర్వకంగానే మౌనంగా ఉన్నానని తెలిపారు. చిత్రీకరణకు ముందు తప్పుకొని నిర్మాత ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar)కు తీవ్ర నష్టం మిగిల్చాడంటూ తాను ఉద్దేశపూర్వకంగానే మౌనంగా ఉన్నానని తెలిపారు.
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ డాన్ 3 చిత్రం షూటింగ్‌కు ముందర వైదొలగడంపై మండిపడుతోంది. చిత్రీకరణకు ముందు ఆయన తప్పుకోవడం కారణంగా నిర్మాత ఫర్హాన్ అక్తర్‌కు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ నష్టాన్ని రణ్వీర్ చెల్లించాలని ఎఫ్‌డబ్ల్యూఐసీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తనపై నిషేధం, విమర్శలపై రణ్వీర్ స్పందించారు.

‘చిత్ర పరిశ్రమలోని ప్రతిఒక్కరిపై, డాన్ ఫ్రాంచైజీతో సంబంధమున్న వారిపై రణ్వీర్ సింగ్‌కు ఎంతో గౌరవముంది. డాన్ 3కి సంబంధించిన తాజా పరిణామాలపై అతడు ఉద్దేశపూర్వకంగానే మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వృత్తిపరమైన చర్చలు, వ్యక్తిగత అభిప్రాయాలు వంటి వాటిని హుందాగా, పరస్పరం గౌరవంతో పరిష్కరించుకోవడం మంచిదనే ఆలోచనతోనే రణ్వీర్ స్పందించలేదు’ అని అధికారిక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు డాన్ ఫ్రాంచైజీకి అంతా మంచే జరగాలని ఆశిస్తున్నట్టు రణ్వీర్ సింగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
Ranveer Singh has finally broken his silence after FWICE issued a non-cooperation directive against him over the Don 3 controversy.
The actor said he chose restraint and dignity over public speculation, while the federation alleges he ignored repeated notices following his… pic.twitter.com/agHHudGwxI
— OpIndia.com (@OpIndia_com) May 25, 2026
‘డాన్ 3 వివాదం గురించి పలురకాల కథనాలు, ఊహాగానాలు మీడియాలో ప్రచారమయ్యాయి. అయినా సరే బహిరంగంగా స్పందించడం ముఖ్యమనిగానీ, తాను ఒక ప్రకటన చేయాలనిగానీ రణ్వీర్ అనుకోలేదు. ఆయనకు తన పని, చేయబోయే ప్రాజెక్ట్‌ల మీదే దృష్టి సారిస్తున్నారు. డాన్ ఫ్రాంచైజీలో భాగమైన వారిపట్ల ఆయనకు చాలా గౌరవముంది. ఫ్రాంచైజీ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. విమర్శలు వస్తున్న ఇలాంటి సమయంలో సంయమనం పాటించడం తెలివైన నిర్ణయమని ఆయన ఆలోచన. ఇకపై కూడా ఆయన ఇదే విధానాన్ని కొనసాగిస్తారు’ అని పోస్ట్‌లో రణ్వీర్ ప్రతినిధి పేర్కొన్నారు.
If reports are true, this could become one of the biggest controversies in Bollywood.
Ranveer Singh is reportedly facing a ban from the film industry after allegedly failing to comply with the agreement signed for Don 3 with Farhan Akhtar.
Now reports claim his ongoing films… pic.twitter.com/ezLousVNZZ
— Nation Today (@NationToday360) May 25, 2026