అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘రణబాలి’ ‘రౌడీ జనార్ధన’ చిత్రాలతో పాటు ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో మైథలాజికల్ యూనివర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేస్తున్నారు. శనివారం విజయ్ దేవరకొండ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘రణబాలి’ ‘రౌడీ జనార్ధన’ సినిమాల తాలూకు స్పెషల్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ‘రణబాలి’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది.
పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చేసిన హార్స్ రైడింగ్, ఈ క్రమంలో గాయాలను తట్టుకొని గుర్రపు స్వారీలో ఆయన పర్ఫెక్షన్ చూపించడం ఈ గ్లింప్స్‌లో ఆకట్టుకుంటున్నది. గుర్రంపై స్వారీ చేస్తూ రణబాలి యుద్ధరంగంలో చేసే సాహసాలు హైలైట్‌గా నిలుస్తాయంటున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్.
రొమాంటిక్ ‘రౌడీ జనార్ధన’:‘రౌడీ జనార్ధన’ స్పెషల్ పోస్టర్లో విజయ్ దేవరకొండ వర్షంలో తడుస్తూ చేతిలో పిస్టల్‌తో కనిపిస్తున్నారు. ‘ప్రపంచంతో పోరాడతాడు. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ ఈ ఫొటోకు జత చేసిన క్యాప్షన్ విజయ్ పాత్రపై ఆసక్తినిరేకెత్తిస్తున్నది. డిసెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.