నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మంగళవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. వచ్చే నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రా నుంది.
ఈ సం దర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నాగశౌర్య అద్భుతమైన నటనతో ఆకట్టుంటాడు. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చిత్రానికి ప్లస్ అవుతుంది’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘ఈసినిమాపై చాలా కాన్ఫిడెంట్గా వున్నాం. దర్శకుడు పవన్ చిత్రాన్ని అందరికి నచ్చే విధంగా తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం అన్ని ఉన్నతంగా ఉంటాయి’ అన్నారు.