Jani Master | జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు
Jani Master | టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి కోర్టు కొట్టివేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జానీ మాస్టర్ అవార్డు తీసుకునేందుకు కోర్టు అక్టోబర్ 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
Jani Master | టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి కోర్టు కొట్టివేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జానీ మాస్టర్ అవార్డు తీసుకునేందుకు కోర్టు అక్టోబర్ 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైన నేపథ్యంలో కేంద్రం జానీ మాస్టర్‌కు ఇచ్చిన అవార్డును రద్దు చేసింది. ఈ కేసులో కొరియోగ్రాఫర్‌కు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రెగ్యులర్ బెయిల్‌ను ఇచ్చేందుకు నిరాకరించింది.
కేసు తీవ్రతతో పాటు బాధితురాలిని బెదిరించడం, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న నాంపల్లి పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ను తీసుకొని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని ఉప్పరపల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రెండో అదనపు జడ్జి ముందు హాజరుపరచగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత నాలుగు రోజుల పోలీసుల కస్టడీకి ఇచ్చింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు జానీ మాస్టర్ ఖండించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

