పంజా వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej), కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga). అర్జున్ రెడ్డి (తమిళ వెర్షన్) ఫేం గిరీసాయ (Gireesaaya) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫన్, లవ్, ఎమోషనల్ ట్రాక్‌తో సాగుతూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.
ఈ సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల అవుతుంది. కాగా మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. సెలబ్రేషన్ మూడ్‌లో కలర్ఫుల్గా సాగుతున్న వెడ్డింగ్ టైటిక్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. రోల్ రైడా రాసిన ఈ పాటను సాగర్, శ్రీనిష జే పాడారు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.