కామెడీ కీడా కోలా
‘క్రైమ్ కామెడీ నాకు ఇష్టమైన జానర్. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ట్రై చేయలేదు. ‘కీడా కోలా’ కథ రాస్తున్నప్పుడు ఈ జానర్ ఎంత కష్టమైందో అర్థమైంది. అయినా సరే ఎంజాయ్ చేస్తూ పనిచేశాం’ అన్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్.
‘క్రైమ్ కామెడీ నాకు ఇష్టమైన జానర్. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ట్రై చేయలేదు. ‘కీడా కోలా’ కథ రాస్తున్నప్పుడు ఈ జానర్ ఎంత కష్టమైందో అర్థమైంది. అయినా సరే ఎంజాయ్ చేస్తూ పనిచేశాం’ అన్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్‌కుమార్ విష్ణు, చైతన్యరావు మదాడి, రాగ్ మయూర్ ప్రధాన పాత్రధారులు. ప్రముఖ హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె.వివేక్ సుదాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మాతలు.
ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని బుధవారం రానా లాంచ్ చేశారు. తరుణ్ భాస్కర్ ఇంకా మాట్లాడుతూ -‘ నా మొదటి రెండు సినిమాల విడుదలకు ముందు కొంచెం నెర్వస్నెస్ వుండేది. ఈ సినిమా విషయంలో మాత్రం కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. ఇప్పటికి సినిమా పదిసార్లు చూశాను. అన్ని వయసులవారూ ఎంజాయ్చేసేలా వచ్చింది’ అన్నారు. ‘కథని బలంగానమ్మి, కథకు కట్టుబడి సినిమాలు తీసే టెక్నీషియన్ తరుణ్ భాస్కర్. సినిమా చూశాను. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. నవంబర్ 3న సినిమాను విడుదల చేస్తున్నాం’ అని రానా చెప్పారు. ఇంకా యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

