Ramcharan | నేపాల్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీపై రామ్‌చరణ్.. వైరల్ అవుతున్న ఫోటో!
Ramcharan Photo | కొన్ని చోట్ల ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ హవానే నడుస్తుంది. ఇటీవలే విడుదలైన ‘ఆచార్య’, ఆర్ఆర్ఆర్కు ఎలాంటి పోటీనివ్వలేదు. సినిమా విడుదలై నెల రోజులు దాటినా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఈ చిత్రం ఆదివారం కూడా దాదాపు కోటీ వరకు కలెక్షన్లను రాబట్టింది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజమౌళి టేకింగ్‌కు సినీప్రముఖులు సైతం ఫిదా అయిపోయారు. చెర్రీ, తారక్‌ల నటన వర్ణనాతీతం. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోగా, అల్లూరీ సీతారామరాజు పాత్రలో చరణ్ జీవించేశాడు. ‘తుఫాన్’ సినిమాకు బాలీవుడ్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చరణ్.. ఈ చిత్రంలో తన నటనతో వాళ్ళనే పొగిడేలా చేశాడు.
అల్లూరీ సీతారామరాజు ఇలానే ఉంటాడా అనేంతలా చరణ్ ఆ గెటప్‌లో అదరగొట్టేశాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక ప్రముఖ నేపాల్ పేపర్ ఫ్రంట్ పేజ్‌లో చరణ్‌కు చెందిన పోస్టర్‌ను వేయడం ఆసక్తిగా మారింది. మ్యాటరేంటో తెలియదు కానీ చరణ్ పోస్టర్ వేయడంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియాలో 1000కోట్ల మార్కును అధిగమించిన మూడో చిత్రంగా నిలిచింది. ఆలీయాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

