RC 16 Movie | రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. ‘ఆర్సీ16’ ఫస్ట్‌లుక్, టైటిల్ రిలీజ్
Peddi First Look | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నేడు తన 40వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖలంతా సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే చరణ్ బర్త్‌డే కానుకగా ఆయన నటిస్తున్న సినిమా నుంచి తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ విడుదలైంది.
Ram Charan 16 Movie | గేమ్ ఛేంజర్ వంటి డిజాస్టార్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఆర్సీ16. ఈ సినిమాకు ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యగా నటించిన దివ్యేందు శర్మ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే నేడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. గుర్తింపు కోసం పోరాటం అంటూ ఈ ఫస్ట్ లుక్‌కి క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
A FIGHT FOR IDENTITY!! #RC16 is #Peddi.
A @BuchiBabuSana film.
An @arrahman musical.@NimmaShivanna #JanhviKapoor @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/fuSN5IjDL1— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

