అనురాగం అవనిజగా మారిన రూపం
దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణం’ ఒకటి.
దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణం’ ఒకటి. ఇందులో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా మూడువేల కోట్ల నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల కానున్నది. ఈ సినిమా సంగీత ప్రయాణంలో భాగంగా ‘రంగులు రంగులే..’ అంటూ సాగే ఈ సినిమాలోని గీతాన్ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు.
సీతారాముల ప్రేమకథను అద్భుతమైన విజువల్స్‌తో ఈ పాటలో చూపించారు. అందమైన ప్రకృతి, వైభవోపేతమైన రాజప్రాసాదాలు, సీతారాముల వివాహ వేడుకలు ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈపాటను విడుదల చేశారు. ‘నువ్వే నా జీవం.. లోకాన.. అనురాగం అవనిజగా మారిన రూపం కనుదీపం.. వైభోగమే వర్షించావు నా కోసం.. హృదయం నీ ధామం..
ఈ జన్మ నీకంకితం.. నీతోడే ఉంటే రంగులు రంగులే.. మంగళ భరితమే.. ప్రేమనే రంగుల సౌధం..’ అంటూ సాగే ఈ పాట తెలుగు వెర్షన్‌ను రాకేందు మౌళి రాయగా, ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. రాఘవ్ కౌశిక్, వైశాలి సామంత్ ఆలపించారు. ‘యుగయుగాలుగా జన హృదయాల్లో జీవిస్తున్న రామాయణ గాధను సంగీతం ద్వారా ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. సీతారాముల ప్రేమభావాలను సంగీతంలో ప్రతిబింబించేందుకు ప్రయత్నించాను. ఈ ‘రంగులు రంగులే..’ పాట ప్రేక్షకుల్లో భక్తిభావంతో పాటు అనిర్వచనీయమైన ఆనందాన్ని, ప్రేమానుభూతిని అందిస్తుందని నా నమ్మకం’ అని మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

