Cinema News | తండ్రీకొడుకుల అనుబంధం.. రామం రాఘవం
‘నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుండి నేర్చుకున్న విషయాల ఆధారంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాను. ఇప్పటివరకూ వంద చిత్రాల్లో నటించా.
Cinema News | ‘నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుండి నేర్చుకున్న విషయాల ఆధారంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాను. ఇప్పటివరకూ వంద చిత్రాల్లో నటించా. ఆ సినిమాల దర్శకులందరూ నాకు గురువులే. వారు నేర్పిన పాఠాలతోనే దర్శకుడిగా మారాను.
సముద్రఖని అన్న లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేదికాదు, నేను దర్శకుడిని అయ్యేవాడ్ని కాదు. ప్రతి ఒక్కరూ నాన్నతో కలిసి చూడాల్సిన సినిమా ఇది’ అని ధనరాజ్ అన్నారు. ఆయన దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’.
సముద్ర ఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి పృథ్వీ పోలవరపు నిర్మాత. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకుడు బాలా, పాండిరాజ్, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, హాస్యనటుడు సూరి, దీపక్, హరీశ్ ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
తండ్రీకొడుకుల అనుబంధం గురించి చెప్పే సినిమా ఇదని, సముద్రఖని లేకపోతే ఈ సినిమా లేదని నిర్మాత తెలిపారు. ధనరాజ్‌పై ఉన్న నమ్మకంతో ఈ కథను తననే డైరెక్ట్ చేయమని చెప్పానని, తను కచ్చితంగా పెద్ద విజయాన్ని అందుకుంటాడని సముద్రఖని నమ్మకం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

