Ramam Raghavam | కోలీవుడ్ దర్శకుడు, నటుడు సముద్రఖని(Samutrakhani) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రామం రాఘవం’ (Ramam Raghavam). ఈ సినిమాతో టాలీవుడ్ నటుడు ధనరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నాడు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటకే ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ గ్లింప్స్‌ను ప్రేమికుల రోజు కానుకగా రేపు ఉదయం 11.11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రామం రాఘవం’ తమిళ తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.
#RamamRaghavam 🏹 First Glimpse for #ValentinesDay #RR #LoveUDaddy pic.twitter.com/hXXdDWWMeq
— Vamsi Kaka (@vamsikaka) February 13, 2024