‘సత్య ఐపీఎస్ అధికారి. అతనంటే సంఘవిద్రోహక శక్తులు హడలిపోతుంటారు. వారిని వయొలెంట్‌గా అటాక్ చేస్తాడు. వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు’ అతని కథేంటో తెలియాలంటే ‘ది వారియర్’ చూడాల్సిందే’ అన్నారు లింగుస్వామి. ఆయన దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నేడు రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీజర్‌ను విడుదల చేశారు.
‘వీలైతే మారిపోండి. లేకపోతే పారిపోండి. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్’ అంటూ టీజర్లో రామ్ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన తొలిసారి పోలీస్ పాత్రను చేయడం విశేషం. ఈ చిత్రం జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. కృతిశెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.