‘పెద్ది’ క్రికెట్షాట్ అక్కడే పుట్టింది!
‘పెద్ది’ ఫస్ట్గ్లింప్స్లో హీరో రామ్‌చరణ్ బ్యాట్‌ను నేలపై కొట్టి మరీ బంతిని సిక్సర్‌గా మలచిన షాట్ చాలా పాపులర్ అయింది. ఈ క్రికెటింగ్ షాట్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. పెద్ది ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో భాగంగా వచ్చే ఈ షాట్‌ను డిజైన్ చేసింది ఫైట్ మాస్టర్ నబాకాంత్.
‘పెద్ది’ ఫస్ట్గ్లింప్స్లో హీరో రామ్‌చరణ్ బ్యాట్‌ను నేలపై కొట్టి మరీ బంతిని సిక్సర్‌గా మలచిన షాట్ చాలా పాపులర్ అయింది. ఈ క్రికెటింగ్ షాట్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. పెద్ది ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో భాగంగా వచ్చే ఈ షాట్‌ను డిజైన్ చేసింది ఫైట్ మాస్టర్ నబాకాంత్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా శనివారం యాక్షన్ కొరియోగ్రాఫర్ నబాకాంత్ విలేకరులతో సినిమాలోని పోరాట ఘట్టాల గురించి ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.
విజయ్, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ దగ్గర శిష్యరికం చేశానని, ‘పుష్ప’ సినిమాతో యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా మారానని అన్నారు. ‘నేను హఫీజ్‌పేట్‌లో పెరిగాను. అది ఫుల్ మాస్ ఏరియా. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఎలాగైనా సిక్స్ కొట్టాలనే కసి ఉండేది. బ్యాట్‌ని కింద నుంచి గట్టిగా కొట్టి సిక్సర్‌కు ప్రయత్నించేవాళ్లం. ఆ మాస్ ైస్టెల్ నుంచే పెద్ది క్రికెట్ షాట్ పుట్టింది’ అని నబాకాంత్ తెలిపారు. ఈ సినిమాలో జాతీయ స్థాయిలో జరిగే కుస్తీ పోటీలు ఉంటాయని, కుస్తీ ఫైట్ ఎపిసోడ్‌ను సహజంగా డిజైన్ చేశామని, రామ్‌చరణ్ గద పట్టుకున్న సీన్ అదే ఎపిసోడ్లో వస్తుందని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

