Ram Charan | ఇక నుంచి డాక్టర్ రామ్‌చరణ్.. చెర్రీకి వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
పురస్కారాలు ప్రతిభకు కొలమానాలు. అర్హత ఉన్న వారిని వరించినప్పుడు పురస్కారాలు కూడా గౌరవంగా ఫీలవుతాయి.
Ram Charan | పురస్కారాలు ప్రతిభకు కొలమానాలు. అర్హత ఉన్న వారిని వరించినప్పుడు పురస్కారాలు కూడా గౌరవంగా ఫీలవుతాయి. చెన్నైకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం నటుడు రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఇది ఆ డాక్టరేట్‌కి లభించిన గౌరవంగా మెగా అభిమానులు భావిస్తున్నారు. నిజానికి కూడా రామ్‌చరణ్ ఈ డాక్టరేట్‌కి కచ్చితంగా అర్హుడు. తక్కువ సినిమాలతోనే ఖండాంతర ఖ్యాతిని ఆర్జించారు రామ్‌చరణ్. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ వరల్డ్ హీరోగా అవతరించారు. త్వరలో ‘గేమ్‌ఛేంజర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటివరకూ రామ్‌చరణ్ హీరోగా చేసిన సినిమాలు కేవలం పద్నాలుగు. వాటిల్లో మూడు ఇండస్ట్రీ హిట్లు. ఇది సాధారణమైన రికార్డు కాదు. సొషియోఫాంటసీ ‘మగధీర’ సినిమాలో కాన్టెంపరరీ పాత్రతో పాటు జానపద వీరుడిగా మెప్పించారు రామ్‌చరణ్.
ఇది ఆయన రెండో సినిమా కావడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’లో మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. తుఫాన్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇక ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా ఆయన నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం నటుడిగానే కాదు, సామాజిక సేవలో కూడా చరణ్ తండ్రికి తగ్గ కొడుకే. అందుకే చరణ్ డాక్టరేట్‌కు అర్హుడంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 13న జరుగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రామ్‌చరణ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ వార్త తమిళనాడు స్థానిక పత్రికల్లో కూడా వెలువడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 15-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
KTR | కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
Palamuru-Rangareddy Project | మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

