Ram Charan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) గత నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూన్ 20న రాంచరణ్-ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకార (Klin Kaara)కు మెగాఫ్యామిలీ ఘనంగా స్వాగతం పలికింది. నేటి (జులై 20)తో క్లీంకార (Klin Kaara)కు వెల్కమ్ చెప్పి నెల రోజులవుతుంది. మరోవైపు గురువారం రోజే ఉపాసన పుట్టినరోజు కావడం మెగాఫ్యామిలీ చాలా ప్రత్యేకమైన సందర్భమనే చెప్పాలి.
ఈ రెండు ప్రత్యేక సందర్బాలను పురస్కరించుకొని క్లీంకార ఆగమనానికి సంబంధించిన వీడియోను హార్ట్ టచింగ్ వీడియోను రామ్ చరణ్ విడుదల చేశారు. క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియోను పాపులర్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించడం విశేషం. ఈ వీడియోలో చిరంజీవి-సురేఖ దంపతులతోపాటు ఉపాసన తల్లిదండ్రులు శోభ-అనిల్ కామినేని ఉన్నారు. హ్యాపీమూడ్లో ఉన్న కుటుంబసభ్యుల ఆనందోత్సాహాలను వీడియోలో చూడొచ్చు.
క్లీంకార పుట్టే సమయంలో అందరిలో ఆందోళన ఉంది. అంతా బాగా జరగాలని మేమంతా ప్రార్థిస్తున్నాం. అంతా ప్రార్థించినట్టుగానే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయంలో క్లీంకారా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిందని భావిస్తున్నాం. పాప పుట్టిన ఆ క్షణం నా మనసుకు ఆహ్లాదంగా, సంతోషంగా అనిపించింది. పాప పుట్టేందుకు పట్టిన 9 నెలల సమయం. ఆ తర్వాతి క్షణాలను తలచుకొని సంతోషంగా ఫీలయ్యామని.. కూతురు పుట్టిన భావోద్వేగపూరిత క్షణాలను ఈ సందర్భంగా అందరితో పంచుకున్నాడు రాంచరణ్.