Game Changer | నో బ్రేక్.. గేమ్ ఛేంజర్ షూటింగ్‌కు రాంచరణ్ రెడీ..!
Game changer | టాలీవుడ్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాలో నటిస్తున్నాడు. అయితే రాంచరణ్ కనీసం రెండు నెలలు సినిమా నుంచి బ్రేక్ తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చింది.
Game changer | టాలీవుడ్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ఇటీవలే కూతురుకు స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సంబురాల్లో మునిగిపోయింది. కాగా రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో 15 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రాంచరణ్ కనీసం రెండు నెలలు సినిమా నుంచి బ్రేక్ తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చింది.
కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న రాంచరణ్ ఇక ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా షూట్‌పై ఫోకస్ పెట్టబోతున్నాడట. తాజా అప్డేట్ ప్రకారం జులైలో షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు చరణ్. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే 2024 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది గేమ్ ఛేంజర్. ఇప్పటికే విడుదల చేసిన మూవీ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో రాజోలు భామ అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

