కథలోని కీలక ఎలిమెంట్స్‌తో ట్రైలర్
అగ్ర హీరో రామ్‌చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై అభిమానుల్లోనూ, ఆడియన్స్‌లోనూ అంచనాలు అంతాఇంతా లేవు. ప్రమోషన్స్‌తో ఇప్పటికే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందీ సినిమా.
అగ్ర హీరో రామ్‌చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై అభిమానుల్లోనూ, ఆడియన్స్‌లోనూ అంచనాలు అంతాఇంతా లేవు. ప్రమోషన్స్‌తో ఇప్పటికే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందీ సినిమా. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ పానిండియా యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఓవర్సీస్లో జూన్ 3న ప్రీమియర్లు జరుగనున్నాయని మేకర్స్ తెలిపారు.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అభిమానుల కోసం ఈ నెల 18న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకూ రామ్‌చరణ్ పాత్రలోని రెండు కోణాలను చూపించిన టీమ్.. రానున్న ట్రైలర్లో కథలోని ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌ని సూచాయగా పరిచయం చేయనున్నట్టు, అలాగే ప్రధాన పాత్రలను కూడా రివీల్ చేయనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో 1960ల నాటి గ్రామీణ యువకుడి లుక్‌లో రామ్‌చరణ్ కనిపించారు. ఆ కాలాన్ని ఎంత సహజంగా, క్రియేటివ్‌గా రీక్రియేట్ చేశారో ఈ పోస్టర్ చూస్తే తెలుస్తున్నది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందుశర్మ, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: ఏఆర్ రెహమాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, సహనిర్మాత: ఇషాన్ సక్సేనా, సమర్పణ: మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

