Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ముద్ర వేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన దర్శనమిచ్చారు. దుబాయ్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ఫోటోషూట్‌లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చరణ్… ఈ కవర్ ఫీచర్‌తో మరో మైలురాయిని అందుకున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే మ్యాగజైన్ కవర్‌పై కనిపించగా, ఇప్పుడు ఆ ఘనత సాధించిన రెండో తెలుగు హీరోగా రామ్ చరణ్ నిలిచారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫోటోషూట్‌లో చరణ్ స్టైలింగ్, ప్రెజెన్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటంతో, ఆయన గ్లోబల్ అప్పీల్ మరింత బలపడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు ఆయన పూర్తి ఇంటర్వ్యూకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఒక పాట మినహా మిగిలిన భాగాలన్నీ కంప్లీట్ కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ సాధించి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. బుచ్చిబాబు స్టైల్ ఎమోషన్స్, చరణ్ మేకోవర్ కలిసి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఒకవైపు అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పై మెరుస్తూ, మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న రామ్ చరణ్… ఈ ఏప్రిల్‌లో అభిమానులకు డబుల్ ట్రీట్ అందిస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Rc