Ram Charan: 14 ఏళ్ల సినీ ప్రస్థానం.. అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. చిరుత సినిమాతో చరణ్ తెరంగేట్రం చేయగా, ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2007న విడుదలైంది. అంటే నేటితో చరణ్ సినిమాల్లోకి వచ్చి 14 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రామ్ చరణ్ 14 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ ఏరియాలో వివిధ రంగులతో రామ్ చరణ్ ఆర్ట్‌ను గీశారు కొందరు అభిమానులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #14YrsOfRAMCHARANEra అనే ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. చరణ్ తన కెరీర్లో మగధీ, రచ్చ, ఎవడు, ధృవ, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాడు.
రీసెంట్గా ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమా షూటింగ్ పూర్తి చేసిన చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- chiruta
- fans
- ram charan
RELATED ARTICLES
తాజా వార్తలు
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

