Peddi First Shot | రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది(Peddi) నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు.
Ram Charan 16 Movie | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమాకు ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా(Buchibabu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్(Jahnvi Kapoor) కథానాయికగా నటిస్తుంది. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం శ్రీరామినవమి కానుకగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఫస్ట్ షాట్(Peddi First Shot) అంటూ ఈ వీడియోను విడుదల చేయగా.. ఒకటే పని చేయడానికి.. ఒకే లాగా బతకడానికి ఇంత పెద్ద బతుకెందుకు. ఏదేమైనా ఈ నెల మీద ఉన్నప్పుడే చేసేయాలి. పుడతామా ఏంటి మళ్లీ అంటూ రామ్ చరణ్ డైలాగ్‌తో ఈ గ్లింప్స్ సాగింది. ఇందులో రామ్ చరణ్ గల్లీ క్రికెటర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యగా నటించిన దివ్యేందు శర్మ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

