Ram Asur Wall Posters | పోస్టర్స్ అతికిస్తున్న హీరోహీరోయిన్లు.. ప్రమోషన్స్ కోసం కోటి విద్యలు
ఈ రోజుల్లో అన్ని హంగులతో సినిమాను రూపొందించడం ఒకెత్తయితే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం మరో ఎత్తవుతోంది. తమ సినిమా ప్రమోషన్ కోసం గతంలో ఎన్నడూలేని విధంగా వినూత్నమైన ప్లాన్ చేశారు "రామ్ అసుర్" (Ram Asur Posters) హీరో అభినవ్ సర్దార్ (Abhinav Sardhar), హీరోయిన్ చాందిని.

ఈ రోజుల్లో అన్ని హంగులతో సినిమాను రూపొందించడం ఒకెత్తయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం మరో ఎత్తవుతోంది. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, వాటిపై ప్రేక్షకుల దృష్టిని పడేలా చేసుకోవడం తప్పనిసరి అయింది. అలా చేయడం వల్లే మూవీ గురించి తెలుసుకొని చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొందరు భారీ ఏర్పాట్లతో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తుంటారు, ఇంకొందరు స్టార్ హీరోలతో టైటిల్, టీజర్ లాంచ్ లాంటివి చేస్తుంటారు. తాజాగా అదే బాటలో తమ సినిమా ప్రమోషన్ కోసం గతంలో ఎన్నడూలేని విధంగా వినూత్నమైన ప్లాన్ చేశారు “రామ్ అసుర్” (Ram Asur Posters) హీరో అభినవ్ సర్దార్ (Abhinav Sardhar), హీరోయిన్ చాందిని (Chandini Tamilarasan).
ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా స్వయంగా జనంలోకి వెళ్లి తమ సినిమా చూడండి. మంచి కంటెంట్ ఉన్న మూవీ అని వాళ్లు చెప్పారు. బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ మూవీ గురించి వివరించారు. అంతేకాదు వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా ఆ ఇద్దరే అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ చూపించారు. వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న”పీనట్ డైమండ్” చిత్రం మాస్ ఆడియన్స్‌కు రీచ్ కావాలని ఈ చిత్ర టైటిల్‌ను ” రామ్ అసుర్ ” గా మార్చారు.

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా నవంబర్ 19న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ (sherry Agarwal) లీడ్ రోల్స్ పోషించారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై నిర్మించారు.
ఇటీవల ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది. అలాగే ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేయడం విశేషం. ఇక రీసెంట్గా పలువురు సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంటోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
ఇది కూడా చదవండి
Puneeth Rajkumar Award | దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

