Rakul preet | దాచేస్తే దాగదు
సాధారణంగా సినీ తారలు ప్రేమ వ్యవహారాల్లో గోప్యతను పాటిస్తుంటారు. తమ లవ్‌లైఫ్ గురించి బాహాటంగా స్పందిస్తే మీడియా అటెన్షన్‌తో పాటు సాంఘిక మాధ్యమాల్లో అనవసరమైన గాసిప్స్ ప్రచారంలోకి వస్తాయని భయపడతారు.
సాధారణంగా సినీ తారలు ప్రేమ వ్యవహారాల్లో గోప్యతను పాటిస్తుంటారు. తమ లవ్‌లైఫ్ గురించి బాహాటంగా స్పందిస్తే మీడియా అటెన్షన్‌తో పాటు సాంఘిక మాధ్యమాల్లో అనవసరమైన గాసిప్స్ ప్రచారంలోకి వస్తాయని భయపడతారు. అయితే పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో తన ప్రేమ వ్యవహారం గురించి రెండేళ్ల క్రితమే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిందీ భామ. రహస్య ప్రేమలపై తనకు నమ్మకం లేదని, ప్రస్తుతం తాను జీవితంలో అత్యంత సంతోషకరమైన దశలో ఉన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్.
పెళ్లి వార్తలపై ఈ భామ స్పందిస్తూ ‘ సెలబ్రిటీలు ప్రేమ వ్యవహారాల్ని దాచడం అంత సులభంకాదు. అందుకే నేను ముందే చెప్పేశా. ఇక నా పెళ్లి గురించి చాలా వార్తలొస్తున్నాయి. గత డిసెంబర్లో సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నానని వదంతులు సృష్టించారు. ఫిబ్రవరిలోనే పెళ్లి జరిగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. ఆ ప్రకారం నాకు రెండుసార్లు పెళ్లి జరిగిపోయినట్లే’ అంటూ చమత్కరించింది . ప్రస్తుతం ఈ భామ ‘ఇండియన్-2’ ‘ఆయలాన్’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

