De De Pyaar De 2 | ఓటీటీలోకి రకుల్ ప్రీత్ సింగ్ దే దే ప్యార్ దే 2.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
De De Pyaar De 2 | అన్షుల్ శర్మ డైరెక్షన్లో దే దే ప్యార్ దే మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన దే దే ప్యార్ దే 2’ (De De Pyaar De 2) నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాగా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫస్ట్ పార్టు అందుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది సీక్వెల్.
De De Pyaar De 2 | బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ ‘దే దే ప్యార్ దే 2’ (De De Pyaar De 2). అన్షుల్ శర్మ డైరెక్షన్లో దే దే ప్యార్ దే మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాగా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ మాధవన్ కీలక పాత్రలో నటించాడు.
అయితే ఫస్ట్ పార్టు అందుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది సీక్వెల్. థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న‘దే దే ప్యార్ దే 2’పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. జనవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. ఎనిమిది వారాల ఓటీటీ విండో తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ క్రేజీ సీక్వెల్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టకుంటుందనేది చూడాలి.
దే దే ప్యార్ దే ఫస్ట్ పార్ట్‌లో తనకంటే వయసులో చాలా చిన్నదైన ఆయేషా (రకుల్ ప్రీత్ సింగ్) ను ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆశిష్ (అజయ్ దేవగణ్) తన మాజీ భార్య (టబు) పర్మిషన్తోపాటు ఆమె కుటుంబం అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు.
ఆయేషా కుటుంబాన్ని ఆశీష్ ఎలా పెళ్లికి ఒప్పిస్తాడు అనే నేపథ్యంలో సీక్వెల్ సాగనుందని ఇప్పటికే ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. సీక్వెల్లో ఆయేషా తండ్రి రోల్లో కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఆర్. మాధవన్ నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కు లవ్ రంజన్ కథ అందించారు.2019లో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైర్ ‘దే దే ప్యార్ దే’కి సీక్వెల్‌గా వచ్చింది.
#DeDePyaarDe2 (Hindi) streaming from January 9 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/PyTvbO1BWw
— OTT Trackers (@OTT_Trackers) January 3, 2026
Read Also :
Mega Family | మెగా హీరోలకి వరుస డిజాస్టర్స్ .. ఆశలన్నీ మన శంకర వరప్రసాద్ గారుపైనే..!
OTT Releases | న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఇవే!
Sree Vishnu | కామెడీ హీరో నుంచి కంటెంట్ స్టార్‌గా శ్రీవిష్ణు.. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ షెడ్యూల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

